Wednesday, August 22, 2007

అరుకులోయ --- నా జ్ఞాపకాలు 3

నమస్తే
అరుకులోయకి సంబందించిన వరుస పొస్టులలొ చివరిది ఇది.ఇంకా సాగదీసి మిమ్మల్ని బోర్ కొట్టించ దలుచుకోలేదు. అరుకులోయ అందాలగని.ఆ అందాలు చూడాలంటే ఏదొ వెళ్లివచ్చాం అన్నట్టు కాకుండా 3 ,4 రొజులు స్టే చేయగలిగితే అన్ని చూడవచ్చు.అలా కొండలలోకి ,అడవులలలోకి ట్రెకింగ్ చేస్తే ఈ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ పొందవచ్చు.బస్ స్టాండ్ కి అతి సమీపంలొ వున్న భూత్ బంగ్లా(ఇది గెస్ట్ హౌస్ ,అప్పుడు పాడు బడి వుండటం వల్ల దీన్ని అలా పిలిచేవారు.ఇప్పుడు ఆధునీకరించబడినది.బస్ స్టాండ్ నుంచి కనిపిస్తుంది.బస్ స్టాండ్ దాటి కొంచం ఎదరకు వెళితే వస్తుంది.ఇక్కడ రైలు స్టేషన్ లేకున్నా పర్యాటకుల విజ్ఞప్తి మేర స్టాప్ పెట్టడమైనది. ట్రైన్ అక్కడ ఆగుతుంది).
[ఈ పొస్ట్ లొని ఫొటొలు "ND TV" వారి వెబ్ సైట్ నుండి గ్రహించడమైనది.]అక్కడ పర్యాటక శాఖ వారు కొన్ని వింత బొమ్మలు పెట్టారు.ఈ కింది ఫొటొ లొ వున్నవి అవే.



ఇక్కడికి సాయంత్రాలు ఎక్కువమంది సేదతీరటానికి వస్తారు.



సుందరకాండ సినిమా లొ వెంకటేష్ కి అపర్ణ ప్రేమలేఖ ఇచ్చే సన్నివేశం ఇక్కడే చిత్రీకరించడమైనది.



ఇక ఈ చివరి ఫొటొ చూడంది.వెనక బేగ్రౌండ్ చూడండి.ఎంత అందంగా వుందో.ఆ వెనక నుంచే ట్రైన్ వెళుతుంది.అక్కడ ఏరు ఒకటి కనిపిస్తుంది కదా దానిని రాళ్ల గడ్డ అంటారు. ఇలాంటి గడ్డలు చాలా వుంటాయి.అలా ఆ గడ్డ దాటి ముందుకు వెళితే కొత్తవలస అనే ఊరు,నర్సరి వస్తాయి.ఇంకా ముందుకు వెళితే కొన్ని గిరిజన గ్రామలు వస్తాయి.



గిరిజన మహిళలు కుట్టుడాకులు(విస్తరాకులు)కుడుతూవుంతారు. ఒకసారి ఆ గ్రామంలొ ఒకావిడ ఇంట్లొ కూర్చుని కుట్టుడాకులు కుడుతూవుంది.ఇంతలొ తలుపు చప్పుడు అయ్యింది.ఎవరా అనుకునేంతలొ మళ్ళి ఎవరో తలుపు కొట్టారు.ఎవరా అని తలుపు తీసిన వెంటనే ఒక ఎలుగుబంటి లాగిపెట్టి చెంపమీద ఒక్కటి ఇచ్చింది.పాపం ఆవిడకు దెబ్బకి తోలు ఊడివచ్చిండి.దాంతొ పెద్దగా కేకలు పెట్టడంతొ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఎలుగుబంటి బయపడి పారిపోతూ నూతిలొ పడి చచ్చింది.దానిని బయటకు తీసి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లొ జనాలు చూడటం కోసం పెట్టారు.అప్పుడు మొదటిసారి ఎలుగుబంటి చూసాను.ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర చాల సినిమాలు తీసారు.ఉదా|| మౌనపోరాటం మొదలైనవి.

ఇక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలొ మూడు గుడులు వున్నాయి.వెంకటేశ్వర స్వామి,ఈశ్వరుడు,సాయిబాబా గుడులు.మొదటి రెండు సుమారు 40 నుంచి వున్నాయి.సాయిబాబా గుడి మాత్రం 10 సంవత్సరాల క్రితం కట్టబడింది.ప్రతి ఏటా వెంకటేశ్వర కళ్యాణం వైభవంగా జరుగుతుంది.

అరుకు ఎంట్రన్స్ లొ ఒక ప్రైవేట్ పాఠశాల వుంటుంది(దాని పేరు....ఆ అల్లూరి సీతారామరాజు పాఠశాల అనుకుంట).సుందరకాండ సినిమా చాలా భాగం అక్కడే తీశారు.ఇక ఇక్కడికి సమీపంలొ మాడుగుల అనే ఊరు వుంది.అక్కడ దొరికే హల్వా రుచి అమోఘం.ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.పట్టుపురుగుల పరిశ్రమ,మల్బరి తోటలు ఇప్పుడు వున్నయొ లేదొ తెలీదు.మా చిన్నపటి నుంచి ఇప్పటివరకు వున్నది ఒకటే థియేటర్.దాని పేరు జ్యోతి.సినిమా మారినప్పుడల్లా రిక్షాలొ నేడే చుడండి బాబు .ఆలసించిన అశాభంగం అంటూ చెబుతుంటే మేము బండి వెనకాల పరుగుపెట్టేవాళ్లం.

అవండి అరుకు సంగతులు,నా జ్ఞపకాలు.
మిమ్మల్ని బాగా బోర్ కొట్టించానా.
మళ్లి కొత్త విశేషాలతొ ఈ "కొత్తబంగారులోకం" లొ కలుస్తాను.
అంతవరుకు శెలవు.
అందరికి ధన్యవాదాలు.
మీ విహారి

3 comments:

హృదయ బృందావని said...

very nice post Vihaari garu :)
అరకు అందాల గురించి వినడమే గాని ఎప్పుడూ వెళ్ళడమే కుదరలేదు. చాలా బాగా రాశారు.

విశ్వనాధ్ said...

బోర్ బోర్ అనుకున్న పర్వాలేదు గాని మరిన్ని ఇలాంటి బోర్ పోష్టులు చాలా వస్తే బాగుంటుంది.
కంటిన్యూ చెయ్యండి.

విహారి(KBL) said...

చాలా థాంక్సండి.